కసాయి తండ్రి | father reject to daughter loses her hand | Sakshi
Sakshi News home page

కసాయి తండ్రి

Jan 23 2018 7:22 AM | Updated on Sep 5 2018 9:47 PM

father reject to daughter loses her hand - Sakshi

కూతురితో తల్లి షబానా

నెలమంగల (దొడ్డబళ్లాపురం): విద్యుదాఘాతంతో చేయి పోగొట్టుకున్న ఆడపిల్ల తనకు వద్దని కన్నతండ్రే నిరాకరించిన సంఘటన నెలమంగల పట్టణంలో వెలుగు చూసింది. నెలమంగల పట్టణంలోని రేణుకానగర్‌లో నివసిస్తున్న సయ్యద్‌భాష, షబానాభాను దంపతుల కుమార్తె ఆషియ (6). రెండు నెలల క్రితం ఇంటిపైన ఆడుకుంటుండగా ఇంటి పక్కనే ఉన్న విద్యుత్‌ తీగ షాక్‌ కొట్టి చిన్నారి ఆషియ కుడిచేయి పోగొట్టుకుంది.

ఆ రోజు నుండి కసాయి తండ్రి ఆస్పత్రికి కాని, ఇంటికి కానీ కన్న కూతురిని చూడడానికి కూడా రాలేదని తల్లి షబానాభాను విలపిస్తోంది. అంతేకాకుండా తన భర్త మరో వివాహం చేసుకుంటాననని చెబుతున్నాడని తనను, తన కూతురిని దిక్కులేని వారిని చేసాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే చేయిలేని కూతురిని ఎలా పెంచగలమని, ఎలా పెళ్లి చేయగలమని అందుకే వదిలేసానని మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించింది. ఇక బెస్కాం అధికారులు కేవలం ఆస్పత్రి ఖర్చులు చూసుకుని పరిహారం ఇవ్వకుండా వెళ్లిపోయారని చెబుతోంది. బెస్కాం అధికారుల నిర్లక్ష్యం, కట్టుకున్న భర్త వదిలేయడంతో షబానాభాను దిక్కుతోచని స్థితిలో ఉంది.తనకు,తన కూతురికి న్యాయం చేయాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement