కొడుకును కిడ్నాప్‌ చేసి.. ఆపై భార్యకు ఫోన్‌ చేసి | Father Kidnaps His Son And Demanded Rs 5 Lakhs In Guntur | Sakshi
Sakshi News home page

కొడుకును కిడ్నాప్‌ చేసి భార్యకు బెదిరింపు కాల్‌

Dec 5 2019 12:26 PM | Updated on Dec 5 2019 2:22 PM

Father Kidnaps His Son And Demanded Rs 5 Lakhs In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తండ్రే తన ఆరేళ్ల కొడుకును కిడ్నాప్‌ చేసిన ఘటన అమరారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి అమరారెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు డబ్బుల కోసం తన స్నేహితులు శామ్యూల్‌, అబ్రహంతో కలిసి కొడుకు పార్థసారధి కిడ్నాప్‌కు పథకం రచించాడు. అనుకున్నట్లుగానే బుధవారం మాధ్యాహ్నం 2. 30 గంటలకు బాలుడిని స్కూల్‌ నుంచి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భార్యకు ఫోన్‌ చేసి రూ. 5 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement