అన్న, వదిన గొడవ పడుతున్నారని.. | Family Conflcits Woman Commits Suicide Hyderabad | Sakshi
Sakshi News home page

అన్న, వదిన గొడవ పడుతున్నారని..

Feb 21 2020 8:39 AM | Updated on Feb 21 2020 8:39 AM

Family Conflcits Woman Commits Suicide Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జీడిమెట్ల: తన అన్న, వదినల మధ్య గొడవలు జరగడాన్ని తట్టుకోలేక మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చింతల్‌ చంద్రానగర్‌లో వజ్రాల రామకృష్ణారెడ్డి, రజని(34) దంపతులు నివాసం ఉంటున్నారు. రామకృష్ణా రెడ్డి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తుండగా, రజని గృహిణి. ఈ నెల 19న రామకృష్ణారెడ్డి ఉదయం డ్యూటీకి వెళ్లగా అతని కుమార్తె సహస్ర స్కూల్‌కు వెళ్లింది.  బుధవారం సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన సహస్ర తలుపు తట్టగా తల్లి ఎంతకూ తెరవకపోవడంతో కింది పోర్షన్‌లో ఉంటున్న వర్మకు విషయం చెప్పింది.

ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా రజని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా  అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. రజని రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.’ తన అన్న వదినల మధ్య గొడవలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు’ అందులో పేర్కొంది. మృతురాలి భర్త రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement