ఒకరికి బదులు మరొకరు..

Fake Students Caught In Open Tenth Class Exams - Sakshi

ఓపెన్‌ టెన్త్‌ పరీక్ష రాస్తూ దొరికిన 23 మంది నకిలీలు

రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

నర్సంపేట రూరల్‌: ఒకరికి బదులు మరొకరు ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు రాసిన సంఘటన నర్సంపేట పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట పట్టణంలో సోమవారం నుంచి ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే   అసలు అభ్యర్థులకు బదులు నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. దీంతో ఇన్విజిలేటర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నర్సంపేట పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో 6, బాలికల హైస్కూల్‌లో 17 మంది పరీక్షలు రాస్తూ దొరికారు. వీరి హాల్‌టికెట్లు, ఓఎంఆర్‌ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, అబ్జర్వర్ల ఫిర్యాదు మేరకు 23 మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కింద రెండు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top