మహిళతో అసభ్య ప్రవర్తన.. డాక్టర్ అరెస్ట్

సాక్షి, హైదరాబాద్ : తలనొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడో కీచక వైద్యుడు. నొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ బస్తీకి చెందిన ఓ మహిళకి తలనొప్పి రావడంతో స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాకు వెళ్లారు. తలనొప్పి, దగ్గు తరచూ వస్తుందని పరీక్షలు చేయమని వైద్యుడు బాలరాజును సంప్రదించారు. నొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలంటూ ఆస్పత్రిలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి