మహిళా పేషంట్‌తో అసభ్యప్రవర్తన.. డాక్టర్‌పై దాడి

Doctor Beaten Up By Woman Patient Husband Over Misbehaving - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళా పేషంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె భర్త డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం హిమాయత్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. హిమాయత్‌ నగర్‌కు చెందిన పీడియాట్రిషన్‌ డా. మైకేల్‌ అరన్హ వద్దకు వచ్చిన మహిళా పేషంట్‌తో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ  ఆమె భర్త తన స్నేహితులతో కలిసి డాక్టర్‌పై దాడి చేశాడు.

దీంతో తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మైకేల్‌ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన గులాం ముస్తఫ్ఫా, అబ్దుల్‌ ఫైజిల్‌లను అరెస్ట్‌ చేశారు. అనంతరం డాక్టర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.   ​

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top