విమానంలో నటికి వేధింపులు.. అరెస్ట్‌

Dangal Actor Molested In Flight Mumbai Police Has Filed A Charge Sheet Against - Sakshi

కొన్ని నెలల క్రితం విమానంలో బాలీవుడ్‌ మైనర్‌ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణికున్ని సహారా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నటి చేసిన ఫిర్యాదు మేరకు వికాస్‌ సచ్‌దేవ్‌ (39) అనే వ్యక్తి మీద పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, దిన్‌దోషి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు పోలీసలు తెలిపారు. వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం బాలీవుడ్‌ ఫేం ‘దంగల్‌’ నటి ఢిల్లీ - ముంబై విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె పక్కన కూర్చున్న తోటి ప్రయాణికుడు వికాస్‌ సచ్‌దేవ్‌ తనతో తప్పుగా ప్రవర్తించాడని, తనను అసభ్యరీతిలో తాకడానికి ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సదరు నటి తనకు జరిగిన అనుభవాన్ని గురించి చెప్తూ వీడియో తీసి, తన సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియో వైరల్‌గా మారటమే కాక సదరు నటి​కి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి సచ్‌దేవ్‌ ఆ సమయంలో తాను అలసిపోయి గాఢనిద్రలో ఉన్నానని.. ఏం చేశానో తనకు తెలియదని తెలిపాడు. అంతేకాక ఆమె కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. సచ్‌దేవ్‌ లీగల్‌ టీం కూడా అతనికి మద్దతూ ఇస్తూ నిజంగా అలాంటి పరిస్థితే ఎదురయితే సదరు నటి విమానంలో ఉన్న అలారంను మోగించాల్సింది అంటున్నారు. అంతేకాక ఈ విషయం గురించి కోర్టులోనే పోరాడతామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top