మెకానిక్‌ పనే..?

Car Theft Case Reveals Hyderabad - Sakshi

కారు చోరీ ఘటనపై ముమ్మర దర్యాప్తు

స్విఫ్ట్‌కారులో వచ్చిన నలుగురు చోరీలో పాల్గొన్నట్లు గుర్తింపు

మెకానిజం తెలిసిన వారి పనిగా అనుమానం

నాగోలు: స్థానిక లలితానగర్‌ కారు చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లలితానగర్‌ కాలనీ రోడ్డు నంబర్‌ 9లో ఉంటున్న కుండారపు రాజాచారి కుమారుడు స్నేహిత్‌రావ్‌ భువనగిరిలో రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన ఫార్చునర్‌ కారు (ఏపీ29 సీఏ 1212)ని ఇంటి ఎదుట పార్కింగ్‌ చేశాడు. బుధవారం సాయంత్రం కారు కనిపించకపోవడంతో ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలనీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో స్విఫ్ట్‌కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారును తీసుకెళ్లినట్లు వెల్లడైంది. అయితే కారు డోర్‌ తెరవడం, స్టార్ట్‌ చేసిన తీరును బట్టి నిందితులకు కారుపై పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు చోరీ చేసిన అనంతరం వీరు సాయినగర్‌ మీదుగా అల్కాపురి సిగ్నల్‌ వరకు వచ్చినట్లు సీసీ పుటేజీల్లో రికార్డైంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top