ఈపూరు కారు.. ప్రొద్దుటూరులో ప్రత్యక్షం | Car Missing Case Revealed | Sakshi
Sakshi News home page

ఈపూరు కారు.. ప్రొద్దుటూరులో ప్రత్యక్షం

Mar 21 2018 9:02 AM | Updated on Mar 21 2018 9:02 AM

Car Missing Case Revealed - Sakshi

కంకిపాడు:  గుంటూరుజిల్లాలో చోరీ అయిన ఇన్నోవా కారు  మండల పరిధిలోని ప్రొద్దుటూరులో ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా వినుకొండ పరిధిలోని ఈపూరులో ఓ ఇన్నోవా కారు చోరీకి గురైం ది. దీనిపై అక్కడ కేసు నమోదైంది. అయితే సోమవారం రాత్రి ప్రొద్దుటూరు–దావులూరు పొలిమేరలోని శ్మశాన వాటిక వద్ద ఓ కారు అనుమానాస్పదంగా పార్కింగ్‌ చేసి ఉండటాన్ని స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రొద్దుటూరు పొలిమేర డొంక వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. కారు నంబరు ఆధారంగా గుంటూరు జిల్లాలోని సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించారు. కారు చోరీకి గురైందని సమాచారం తెలిపారు. కారును మంగళవారం ఉదయం కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీసీఎస్‌ పోలీసులు రికార్డులతో స్టేషన్‌కు వచ్చి చోరీకి గురైన కారును తమ వెంట తీసుకెళ్లినట్లుగా సిబ్బంది తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement