ఆడుకుంటూ బాలుడి మృతి.. వీడియో వైరల్‌ 

A Boy Died In Rajendranagar While Playing In Park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆడుకుంటూ మృతి చెందాడు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్‌ శర్మ సిమెంట్‌ బెంచ్‌పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు.. సిమెంట్‌ బెంచ్‌ ఆ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు అపార్ట్‌మెంట్‌వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top