అజిత్‌సింగ్‌నగర్‌ హత్య కేసులో అరెస్టులు | arrests in ajithsinghnagar murder case | Sakshi
Sakshi News home page

అజిత్‌సింగ్‌నగర్‌ హత్య కేసులో అరెస్టులు

Dec 18 2017 6:27 PM | Updated on Apr 3 2019 3:50 PM

విజయవాడ : నగరంలోని అజిత్సింగ్ నగర్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. షేక్‌ బాజి,కన్నా, శశికుమార్, మరో జువైనల్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ మద్యం మత్తులో కొంతమంది జులాయిల వల్ల ఈ హత్య సంఘటన జరిగిందని చెప్పారు. ఇందులో బ్లేడ్ బ్యాచ్ల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బహిర్భూమికి వెళ్లిన వెంకటేశ్వరరాజుపై నిందితులు దాడికి పాల్పడ్డారని, దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. నగరం పోలీస్ నిఘా నీడలో ఉందని, నగరంలో ఉన్న రౌడీ షీటర్స్, అనుమానితులకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వివరించారు. పిల్లల నడవడిక పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement