మరో ఫైర్ఫాక్స్ ఫోన్.. వచ్చేస్తోంది! | Zen Mobile to launch Firefox phone this month | Sakshi
Sakshi News home page

మరో ఫైర్ఫాక్స్ ఫోన్.. వచ్చేస్తోంది!

Oct 11 2014 10:46 AM | Updated on Sep 2 2017 2:41 PM

మరో ఫైర్ఫాక్స్ ఫోన్.. వచ్చేస్తోంది!

మరో ఫైర్ఫాక్స్ ఫోన్.. వచ్చేస్తోంది!

భారతీయ మార్కెట్లోకి మరో ఫైర్ఫాక్స్ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే మూడు ఫైర్ఫాక్స్ ఫోన్లు రాగా, ఇప్పుడు కొత్తగా జెన్ మొబైల్స్ సంస్థ కూడా తమ ఫోన్ను విడుదల చేస్తోంది.

భారతీయ మార్కెట్లోకి మరో ఫైర్ఫాక్స్ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే మూడు ఫైర్ఫాక్స్ ఫోన్లు రాగా, ఇప్పుడు కొత్తగా జెన్ మొబైల్స్ సంస్థ కూడా తమ ఫోన్ను విడుదల చేస్తోంది. ఇది మరో నెలరోజుల్లో మార్కెట్లను ముంచెత్తనుంది. ఫైర్ఫాక్స్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్ను జెన్ మొబైల్స్ సంస్థ విడుదల చేస్తోందని, ఇది అక్టోబర్ నెలాఖరులోగానే భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోందని మొజిల్లా సంస్థ తెలిపింది.

గత ఆగస్టు నెలలో భారతదేశంలోనే తొలిసారిగా స్పైస్ మొబైల్స్ ఫైర్ వన్ ఎంఐ- ఎఫ్ఎక్స్1 ఫోన్ను విడుదల చేసింది. ఇది కాక ఇంకా ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్, అల్కాటెల్ వన్ టచ్ ఫైర్సి ఫోన్లు కూడా వచ్చాయి. ఈబే, ఈఎస్పీఎన్, వుక్లిప్, జొమాటో లాంటి పలు యాప్లను తమ స్మార్ట్ఫోన్లలోకి ప్రవేశపెట్టాలని ఫైర్ఫాక్స్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement