ఎస్‌ బ్యాంకు టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

Yes Bank drops out of India's top 10 most valued lenders - Sakshi

ఎస్‌ బ్యాంకునకు రేటింగ్‌ షాక్‌ 

20 బ్రోకరేజ్‌ సంస్థలు సెల్‌ రేటింగ్‌ 

మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్‌బ్యాంకును కష్టాలు వీడడం లేదు. ఇటీవల తీవ్ర నష్టాలతో కుదైలైన ఎస్‌బ్యాంక్‌నకు తాజాగా రేటింగ్‌షాక్‌ తగిలింది.  బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ ఇండియా  ఎస్‌బ్యాంకు  ర్యాంకింగ్‌ 47 శాతం డౌన్‌ గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన రూ. 170 ను రూ. 90కు కుదించి సెల్‌ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో  అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. గురువారం దాదాపు 13శాతం నష్టాలతో కొనసాగుతోంది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పనితీరు మరింత నీరసించవచ్చని, బ్యాంకు ఆదాయాలు తగ్గిపోనున్నాయని యూబీఎస్‌  అంచనా వేసింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేరులో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.   దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎస్‌బ్యాంకు దేశంలోని 10 అత్యంత విలువైన  బ్యాంకుల జాబితాలో  స్థానం కోల్పోయింది. దాదాపు 20 బ్రోకరేజ్‌ సంస్థ ఎస్‌బ్యాంకు షేరుకు సెల్‌ రేటింగ్‌ ఇచ్చాయి. మూడీస్‌ ఇన్వెస్టర్ సర్వీసెస్‌ యస్‌ బ్యాంక్‌ విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏ1కు సవరించింది. ఫైనాన్స్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా బ్యాంక్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలహీనపడవచ్చని మూడీస్‌ అభిప్రాయపడింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 6.61 ట్రిలియన్లతో టాప్‌ టెన్‌ జాబితాలో టాప్‌లో ఉండగా, ఎస్‌బీఐ 3.05 ట్రిలియన్ల  మార్కెట్‌ క్యాప్తో రెండవ స్థానంలో, కోటక్‌ మహీంద్రా 2.84 ట్రిలియన్లతో మూడవ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్  2.69 ట్రిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ (2.14 ట్రిలియన్లు) ఇండస్ఇండ్ బ్యాంక్ (రూ.87,540 కోట్లు) బంధన్ బ్యాంక్ (రూ. 64,808 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బ్యాంకు (రూ.40,420కోట్లు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 34093 కోట్ల)  తరువాతి స్థానాల్లో నిలిచాయి.  

కాగా టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల బ్యాంక్‌ బోర్డు నుంచి నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముకేష్ సబర్వాల్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top