షావోమి ఎంఐ ఫ్యాన్‌ షేల్‌ షురూ!

Xiaomi 'No.1 Mi Fan Sale' Kicks off in India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ దిగ్గజం  షావోమి  నెం.1 ఎంఐ ఫ్యాన్‌ సేల్‌ పేరుతో డిస్కౌంట్‌ అమ్మకాలను ప్రారంభించింది. నేటి (డిసెంబరు19వ తేదీ నుంచి  21వ తేదీ ) నుంచి  మూడు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తుంది.  ఈ సేల్‌లో  స్మార్ట్‌ఫోన్లు, ఎంఐ ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా  అందిస్తోంది. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెడ్‌ మీ నోట్‌ 5 ప్రొ, ఎం ఏ2, రెడ్‌ మీవై2 స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎంఐటీవీలపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది.

ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999లకే లభ్యం.
ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు అందుబాటులో ఉంది.
రెడ్‌మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యమవుతోంది.
4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు  విక్రయిస్తోంది.
రెడ్‌మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్  వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.10,999లభ్యం.
3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం.

ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి.

అంతేకాదు ఈ  సేల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500, . పేటీఎం యూజర్లు రూ.300 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే  మొబిక్విక్‌ యూజర్లు 10శాతం దాకా డిస్కౌంట్‌ పొందే అవకాశం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top