ప్రపంచ మార్కెట్లకు భారీ నష్టాలు | World stock markets suffer as Greece closes banks | Sakshi
Sakshi News home page

ప్రపంచ మార్కెట్లకు భారీ నష్టాలు

Jun 30 2015 12:28 AM | Updated on Sep 3 2017 4:35 AM

గ్రీసు సంక్షోభం దెబ్బకు ఆసియా, యూరప్, అమెరికా, అన్ని దేశాల మార్కెట్లు నేలచూపులే చూశాయి. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను

 గ్రీసు సంక్షోభం దెబ్బకు ఆసియా, యూరప్, అమెరికా, అన్ని దేశాల మార్కెట్లు నేలచూపులే చూశాయి. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ, ఆ దేశపు స్టాక్ మార్కెట్ సూచీ షాంగై కాంపోజిట్ 138 పాయింట్లు(3.4 శాతం) నష్టపోయి 4,035 పాయింట్ల వద్ద ముగిసింది. జపాన్‌కు చెందిన నికాయ్ 596 పాయింట్లు(3 శాతం) పడిపోయి 20,110 వద్ద ముగిసింది. హాంగ్‌సెంగ్ 697 పాయింట్లు(2.6 శాతం) క్షీణించి 25,967 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 ఇక యూరప్ మార్కెట్లు భారీ నష్టాలనే చవి చూశాయి. జర్మనీకి చెందిన డ్యాక్స్ 409 పాయింట్లు(3.6 శాతం) నష్టపోయి 11,083 పాయింట్లకు దిగజారింది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 40 సూచీ 189 పాయింట్లు(3.8 శాతం) కోల్పోయి4,870కు పడిపోయింది. ఇంగ్లాండ్‌కు చెందినఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ 133 పాయింట్లు(2 శాతం) క్షీణించి 6,620 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్ 72 పాయింట్లు(1.4 శాతం) క్షీణించి 5,008 పాయింట్ల వద్ద, డోజోన్స్ 242 పాయింట్లు (1.3 శాతం) కోల్పోయి 17,704 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింత కొనసాగుతుందని నిపుణులంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement