‘మనోళ్లు రూ 55,000 కోట్లు పంపారు’

World Bank Says India Highest Recipient Of Remittances    - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది విదేశాల్లో భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా 79 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 55 వేల కోట్లు పైగా స్వదేశానికి పంపారని ప్రపంచ బ్యాంక్‌ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌ తర్వాత 67 బిలియన్‌ డాలర్లతో చైనా, 36 బిలియన్‌ డాలర్లతో మెక్సికో టాప్‌ 3 స్ధానాల్లో నిలవగా, ఫిలిప్పీన్స్‌, ఈజిప్ట్‌లు తర్వాతి స్ధానాల్లో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.

స్వదేశాలకు డబ్బు పంపడంలో భారత్‌ అగ్రస్ధానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన వలసలు, అభివృద్ధి నివేదిక తెలిపింది. 2016లో భారత్‌ స్వదేశంలో తమ వారికి చేరవేసిన మొత్తం 62.7 బిలియన్‌ డాలర్లు కాగా, 2017లో వాటి మొత్తం 65.3 బిలియన్‌ డాలర్లకు పెరగ్గా 2018లో రెమిటెన్స్‌లు 79 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. 2018లో భారత్‌కు తరలిన విదేశీ కరెన్సీ 14 శాతం పెరిగిందని, కేరళలో పోటెత్తిన వరదల వల్ల అక్కడి నుంచి వలస వచ్చిన వారు తమ కుటుంబాలకు పెద్దమొత్తంలో సొమ్ము పంపడంతో రెమిటెన్స్‌లు పెరిగాయని ఈ నివేదిక అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top