ఏపీలో వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్ | Wonderland Amusement Park in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్

Sep 17 2015 2:03 AM | Updated on Aug 18 2018 8:05 PM

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది

50 ఎకరాల్లో.. 250 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ రానుందని సంస్థ ఎండీ అరుణ్  కె. చిట్టిలపిళ్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని.. తొలి దశను 2019 నాటికి, రెండో దశను 2020 నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్‌తో 700 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement