విరాట్‌ కోహ్లి కొనసాగుతాడు

Virat Kohli to continue as PNB brand ambassador - Sakshi

భారీ కుంభకోణంతో సతమతమవుతున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుపై పలు తప్పుడు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇన్ని రోజులు బ్యాంకుకు బ్రాండు అంబాసిడర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి, ఈ కుంభకోణ నేపథ్యంలో తప్పు కుంటున్నాడని, బ్యాంకు తన కస్టమర్ల విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధిస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై పీఎన్‌బీ క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి కొనసాగుతాడని పీఎన్‌బీ పేర్కొంది. కస్టమర్ల విత్‌డ్రాయల్స్‌పై ఎలాంటి పరిమితులు విధించడం లేదని, సాధారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని బ్యాంకు స్పష్టంచేసింది. అదేవిధంగా ఆడిట్‌ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) పీఎన్‌బీలో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని విచారణ జరుపనుందని వస్తున్న వార్తలను కూడా బ్యాంకు కొట్టివేసింది.  

కుంభకోణ నేపథ్యంలో బ్యాంకుతో  ఉన్న ఎండోర్స్‌మెంట్‌ను విరాట్‌ రద్దు చేసుకుంటున్నాడంటూ మీడియా రిపోర్టులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రిపోర్టులన్నీ పూర్తిగా తప్పుడవని, నిరాధారమైనవని బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లి కొనసాగుతాడని బ్యాంకు తెలిపింది. ఈ మోసాన్ని విచారించడానికి పీడబ్ల్యూసీతో కలిసి పనిచేయడం లేదని, అయితే నీరవ్‌ మోదీకి, ఆయన సంబంధిత కంపెనీలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను తామే సేకరిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్ధిక నేరాలపై పీడ‌బ్ల్యూసీ విచారణ చేస్తుంది.  కానీ ప్రస్తుతం పీడబ్ల్యూసీ సహకారాన్ని పీఎన్‌బీ తీసుకోవడం లేదు. ఈ పరిస్థితిని పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి, సంస్థ,  వినియోగదారుల, వాటాదారుల కాపాడటానికి తగిన సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్యాంక్ పునరుద్ఘాటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top