ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు ! | TVS launches new bike | Sakshi
Sakshi News home page

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

May 28 2014 2:15 AM | Updated on Sep 2 2017 7:56 AM

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

ఏడాదిలో మరో 3 టీవీఎస్ వాహనాలు !

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మరో 3 టీవీఎస్ వాహనాలు విపణిలోకి రానున్నాయి. 2 నెలల్లో దేశీయ మార్కెట్లోకి ‘జెస్ట్ స్కూటీ’ను విడుదల చేయనున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ (సేల్స్) వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి మరో 3 టీవీఎస్ వాహనాలు విపణిలోకి రానున్నాయి. 2 నెలల్లో దేశీయ మార్కెట్లోకి ‘జెస్ట్ స్కూటీ’ను విడుదల చేయనున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ (సేల్స్) వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు.

మంగళవారమిక్కడ ‘స్టార్ సిటీ ప్లస్’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
 ఏపీలో నెలకు లక్ష వాహనాలు..: నెలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుండగా.. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ వాటా 30 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది నెలకు 1.48 లక్షల టీవీఎస్ వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది 1.85 లక్షల బైకులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 17% మార్కెట్ వాటాతో నెలకు లక్ష వరకు టీవీఎస్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. 120 సీసీ లోపు ఉన్న టీవీఎస్ వాహనాలు నెలకు 35 వేలు అమ్ముడవుతుండగా.. 2 నెలల్లో వీటి సంఖ్యను 45 వేల యూనిట్లకు చేర్చుతాం. అంటే రెండు నెలల్లో 10 వేల స్టార్‌సిటీ ప్లస్ బైకులను విక్రయిండమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నమాట.

 16% వృద్ధికి వాహన పరిశ్రమ..: దేశవ్యాప్తంగా ఏటా వాహనాల పరిశ్రమ 8% వృద్ధిని కనబరుస్తోంది. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాల రాక తో ఈ ఏడాది చివరి వరకు రెట్టింపు వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నాం. అంటే 16% వృద్ధికి చేరుకుంటుంది.

 ‘స్టార్ సిటీ ప్లస్’ గురించి క్లుప్తంగా..
 ఆల్ న్యూ స్టార్‌సిటీ ప్లస్ వాహనాలు నలుపు, నీలం, స్కార్లెట్ 3 రంగుల్లో లభ్యమవుతున్నాయి. 110 సీసీ అడ్వాన్స్ ఏకోత్రస్ట్ ఇంజిన్‌ను అమర్చాం. మైలేజీ.. లీటరుకు 86 కి.మీ. దీని ధర రూ.42 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement