మరిన్ని నగరాలకు ట్రూజెట్ | To More cities trujet | Sakshi
Sakshi News home page

మరిన్ని నగరాలకు ట్రూజెట్

Sep 10 2015 1:07 AM | Updated on Aug 28 2018 4:30 PM

మరిన్ని నగరాలకు ట్రూజెట్ - Sakshi

మరిన్ని నగరాలకు ట్రూజెట్

టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న చౌక విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది...

- నేటి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు
- త్వరలో విశాఖ, విజయవాడలకు
 - ట్రూజెట్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న చౌక విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్- బెంగళూరు, బెంగళూరు-షిరిడీ (ఔరంగాబాద్)లకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో కలిపి మొత్తం ఆరు పట్టణాలకు తాము విమాన సర్వీసులను అందిస్తున్నామని, త్వరలోనే దక్షిణాదిలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించనున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు.

ఈ నెలాఖరుకు మూడో విమానం అందుబాటులోకి వస్తుందని, దీంతో విజయవాడ, విశాఖపట్నంలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి విజయవాడకు సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యనే ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మా సర్వీసులకు డిమాండ్ బాగుందని, లోడ్ ఫ్యాక్టర్ 85 నుంచి 90 శాతంగా ఉందన్నారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే నిర్వహణా లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement