మనకూ.. వైటల్‌ వెంటిలేటర్లు! | Three Indian companies get licence for vital | Sakshi
Sakshi News home page

మనకూ.. వైటల్‌ వెంటిలేటర్లు!

May 30 2020 2:01 PM | Updated on May 30 2020 2:24 PM

Three Indian companies get licence for vital - Sakshi

నాసా అభివృద్ధి చేసిన వైటల్‌ వెంటిలేటర్‌ను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు  లైసెన్సులు పొందాయి. కోవిడ్‌-19 రోగులకు క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్సనందించే ఈ వెంటిలేటర్లను తయారు చేసేందుకు ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భారత్‌ ప్రాగ్‌ లిమిటెడ్‌, మేధా సర్వ్‌ డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు అనుమతి పొందినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్‌ కంపెనీలతోపాటు మరో 18 కంపెనీలకు ఈ అనుమతి లభించింది. వీటిలో 8 అమెరికన్‌ కంపెనీలు, 3 బ్రెజీలియన్‌ కంపెనీలు కూడా ఈ అనుమతులు పొందినట్లు నాసా వెల్లడించింది.
  నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా) క్యాలీఫోర్నియాలోని  జెట్‌ ప్రపల్షన్‌ ల్యాబొరేటరీ(జేపీఎల్‌)లో ప్రత్యేకమైన వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది. జేపీఎల్‌ ఇంజినీర్లు కరోనా రోగులకు  సమర్థవంతంగా చికిత్సనందించే వైటల్‌ అనే వెంటిలేటర్‌ను రూపొందిచారు. అత్యవసర పరిస్థితులో ఈ వెంటిలేటర్‌ను వాడేందుకు  అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 30న ఆమోదం తెలిపింది. డాక్టర్లు, మెడికల్‌ పరికరాల తయారీదారులను సంప్రదించి నాసా ఈ వైటల్‌ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వెంటిలేటర్ల కంటే అతితక్కువ వ్యయంతో వీటిని తయారు చేయవచ్చని నాసా పేర్కొంది. సాధారణ వెంటిలేటర్‌ తయారిలో వాడే పరికరాలలో 7 వంతు మాత్రమే వినియోగించి ఈ వైటల్‌ వెంటిలేటర్‌ను తయారు చేసినట్లు తెలియచేసింది. అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుండడంతో అధిక మొత్తంలో వీటిని తయారు చేసేందుకు వివిధ కంపెనీలకు నాసా ఆనుమతులను మంజూరు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement