ఆపిల్‌ రాక ఎంతో ఆనందదాయకం | Suresh Prabhu says happy to receive Apple in India | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ రాక ఎంతో ఆనందదాయకం

Nov 27 2017 9:51 AM | Updated on Aug 20 2018 2:55 PM

Suresh Prabhu says happy to receive Apple in India - Sakshi - Sakshi - Sakshi

ప్రపంచపు టెక్‌ దిగ్గజం ఆపిల్‌, తన కంపెనీ తయారీ యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటుచేయడానికి కేంద్రం సపోర్టు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ అన్నారు. వారి నుంచి అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. ''వారి నుంచి మంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. ఆపిల్‌ రాక నిజంగా చాలా ఆనందదాయకం. ఆపిల్‌ ప్రపంచంలో టాప్‌ బ్రాండుల్లో ఒకటి. ఒకవేళ వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించడానికి కృషిచేస్తాం. మేము అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నాం'' అని సురేష్‌ ప్రభు అన్నారు. 

అయితే కూపర్టినోకి చెందిన ఈ కంపెనీ, భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి పలు రాయితీలను అభ్యర్థిస్తోంది. ప్రతిపాదించిన తయారీ యూనిట్‌లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ వివరాలను వంటి వాటిని కేంద్రం ఆపిల్‌ నుంచి కోరుతోంది. కాగ, ఆపిల్‌ కోరుతున్న చాలా డిమాండ్లను కేంద్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని మార్చి నెలలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement