ప్రతికూల పరిస్థితుల్లోనూ వీటిని కొనవచ్చు

stock recomandations - Sakshi

ప్రస్తుత కాలంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలకు మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అందువల్ల మదుపరులు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతూ కొన్ని షేర్లను కొనవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అవి ఈ విధంగా ఉన్నాయి.

కంపెనీ పేరు: క్వెస్‌ కార్పొరేషన్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌ : కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.360
ప్రస్తుత ధర: రూ.221

బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ క్వెస్‌ కార్పోరేషన్‌ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో 14 పీఈ అంచనాతో ఈ షేరుకు టార్గెట్‌ ధరను రూ.360 గా నిర్ణయించింది. ఏప్రిల్‌,మే నెలల్లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. రెండేళ్లలో ఈపీఎస్‌ 13 శాతం పెరుగుతుందని అంచనా వేస్తూ ఈ షేరును కొనవచ్చని సిఫార్సు చేసింది. కాగా బీఎస్‌ఈలో క్వెస్‌ కార్పొరేషన్‌ షేరు ప్రస్తుత ధర రూ.221.55 గా ఉంది.

కంపెనీ పేరు:బయోకాన్‌
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.390
ప్రస్తుత ధర: రూ.354

బయోకాన్‌ షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ బయ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో 31 పీఈ అంచనాతో ఏడాదికాలానికి గాను ఈ షేరు టార్గెట్‌ ధరను రూ.390 గా నిర్ణయించింది. కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ బయోకాన్‌ కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల కంపెనీ మీడియం టర్మ్‌ వృద్ధి అవుట్‌లుక్‌ బావుంటుందని అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈషేరు ధర రూ.354.70 గా ఉంది.

కంపెనీ పేరు: కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌
బ్రోకరేజ్‌ సంస్థ: యస్‌ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.313
ప్రస్తుత ధర: రూ.204.95

బ్రోకరేజ్‌ సంస్థ యస్‌ సెక్యూరిటీస్‌ కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.313గా నిర్ణయించింది.మార్చితో ముగిసిన క్యూ4లో ఈ కంపెనీ ఫలితాలు బ్రోకరేజ్‌ల అంచనాలను అందుకున్నాయని యస్‌సెక్యూరిటీస్‌ తెలిపింది. ఆయిల్‌-గ్యాస్‌ విభాగంలో ఆదాయం 75 శాతం పెరిగినప్పటికీ టీ అండ్‌ డీ ఆదాయాలు క్షీణించాయని వెల్లడించింది.లాక్‌డౌన్‌ వల్ల విక్రయాలు క్షీణించినప్పటికీ ఆర్థిక సంవత్సరం-21లో మార్జిన్‌ వృద్ధి పెరుగుతుందని తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.204.95 గా ఉంది.

కంపెనీ పేరు: కోల్‌ ఇండియా
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.195
ప్రస్తుత ధర: రూ.141

బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ కోల్‌ ఇండియా షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌ ధరను రూ.195గా నిర్ణయించింది. కోల్‌ ఇండియా తన సొంత గనులు పవర్‌ ప్లాంట్‌లలో ఉత్పత్తిని తగ్గించిందని, తద్వారా కంపెనీపై పడుతున్న అధిక భారాన్ని (ఓవర్‌ బర్డెన్‌ రిమూవల్‌-ఓబీఆర్‌)కొంత మేర తగ్గిస్తుందని మోతీలాల్‌ తెలిపింది. గడిచిన రెండునెలల కాలలంలో ఓబీఆర్‌ 15 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.141.05 గా ఉంది.

కంపెనీ పేరు: ప్రిజం జాన్సన్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే గ్లోబల్‌
రేటింగ్‌: హోల్డ్‌లో ఉంచింది 
టార్గెట్‌ ధర: రూ.39
ప్రస్తుత ధర: రూ.33

బ్రోకరేజ్‌ సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ ప్రిజం జాన్సన్‌ కంపెనీ రేటింగ్‌ను హోల్డ్‌లో ఉంచుతూ ..ఏడాదికాలానికి గాను టార్గెట్‌ ధరను రూ.39 గా నిర్ణయించింది. సిమెంట్‌ విభాగంలో అధిక లాభార్జనతో అంచనాలను మించిపోతుందని ఎమ్‌కే గ్లోబల్‌ తెలిపింది.ఇబీటా రూ.1.4 బిలియన్ల వద్ద స్థిరంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.33.30 గా ఉంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top