మార్చి 29 నుంచి 20 కొత్త విమానాలు  | SpiceJet launches 20 new flights from March 29 | Sakshi
Sakshi News home page

మార్చి 29 నుంచి 20 కొత్త విమానాలు 

Feb 19 2020 7:38 PM | Updated on Feb 19 2020 7:51 PM

 SpiceJet launches 20 new flights from March 29 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని స్పైస్‌జెట్‌ బుధవారం ప్రకటించింది. మార్చి29, 2020నుండి 20కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.  తద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే పథకంలో  భాగంగా 12 నగరాలను కలిపేలా మొత్తం 52 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. 

కొత్త విమానాలలో వారణాసి-పాట్నా , అమృత్‌సర్-పాట్నా  ఉడాన్ మార్గాల్లో నాన్-స్టాప్ సేవలు ఉంటాయి. గువహటి-పాట్నా, హైదరాబాద్-మంగళూరు, బెంగళూరు-జబల్‌పూర్, పాట్నా-వారణాసి, ముంబై- ఔరంగాబాద్ ఉన్నాయి. దీనికి అదనంగా ముంబై-బాగ్డోగ్రా, ముంబై-చెన్నై, హైదరాబాద్-మంగళూరు, గౌహతి-డిల్లీ మార్గాల్లో సేవలను క్రమేపీ పెంచనుంది. 

20 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించినందుకు  సంతోషంగా ఉందని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. తమ నెట్‌వర్క్‌ను కొత్త నగరాలుకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందిస్తామన్నారు. అలాగే మెట్రోలు, నాన్-మెట్రోల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశంలోని అనుసంధానించబడని భాగాలను కూడా అనుసంధానించడంపై కూడా  దృష్టి పెట్టామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement