నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష

Single Online Exam For Non Gazetted Jobs Says Central Government - Sakshi

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా నాన్‌ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

రాబోయే రోజుల్లో అన్ని నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో తెచ్చుకున్న మార్కులను ఏ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగానికైనా మూడేళ్ల వరకు పరిగణలోకి తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ),  ఐబీపీఎస్‌లు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.  ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేపట్టిన విషయం విదితమే.

చదవండి: బంగారు బాతును చంపేస్తారా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top