సింగ్‌ బ్రదర్స్‌ వివాదం న్యూ ట్విస్ట్‌

Shivinder withdraws petition in NCLT against elder brother Malvinder - Sakshi

సాక్షి, ముంబై: వ్యాపారాన్ని భారీ నష్టాన్ని కలిగిస్తున్నారంటూ సోదరుడిపై ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేసిన  శివిందర్‌ సింగ్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. సోదరుడు మల్వీందర్‌ సింగ్‌పై  తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.  కుటుంబ పెద్దలు, ఇతర సభ్యుల జోక్యంతో తన సోదరుడు మల్వీందర్‌పై దాఖలు చేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు  ప్రకటించారు. ఈ మేరకు గురువారం కోర్టును ఆశ్రయించారు.

శుక్రవారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యూఢిల్లీ బెంచ్‌ ముందుకు ఈ  కేసు శుక్రవారం  విచారణకు రానున్న నేపథ్యంలో ఈ  పరిణామం చోటు చేసుకుంది.  అన్నపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శివిందర్‌  ప్రకటించారు.  అంతేకాదు  ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం విఫలమైతే  తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా శివిందర్, అతని భార్య అదితి ఎస్.సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ‍్యంగా సింగ్‌ బ్రదర్స్‌ తల్లి నిమ్మీ సింగ్ గత కొన్ని రోజులుగా నిద్రాహారాలు మాని, కొడుకులిద్దరితోనూ, వరుసగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఔషధసంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్‌ సోదరుల మధ్య విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడు తున్నారంటూ అన్న మల్వీందర్‌ సింగ్‌పై సోదరుడు శివీందర్‌ సింగ్‌ కోర్టుకెళ్లారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్‌ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్‌ మాజీ చీఫ్‌ సునీల్‌ గోద్వానీలపై శివీందర్‌ సెప్టెంబర్‌ 4న ఎన్‌సీఎల్‌టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top