ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు | Sensex rangebound, Nifty50 breaks below 7,800; Bank of Baroda slumps | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

May 16 2016 10:39 AM | Updated on Sep 4 2017 12:14 AM

సోమవారం నాటి స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్  సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది.

మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement