కరోనా భయాలు : మార్కెట్ల పతనం | Sensex Plunges From Day High | Sakshi
Sakshi News home page

కరోనా భయాలు : మార్కెట్ల పతనం

Apr 8 2020 3:58 PM | Updated on Apr 8 2020 3:58 PM

Sensex Plunges From Day High - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోముగిసాయి.  రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాల్లోనే ముగిసాయి.  ఆరంభంలోనే 400 పాయింట్లు కోల్పోయిన మార్కెట్ , వెంటనే పుంజుకుని  కనిష్టం నుంచి దాదాపు 1500 పాయింట్లు ఎగిసింది.  తద్వారా 2009 తర్వాత అదే అతిపెద్ద ఇంట్రా డే లాభంగా నిలిచింది.  కానీ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో నిలదొక్కుకోలేక లాభాలను కోల్పోయింది.   చివరకు సెన్సెక్స్  173 పాయింట్లు క్షీణించి 29883 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు నశించి 8748 వద్ద స్థిరపడ్డాయి.  ఫలితంగా  సెన్సెక్స్ 30 వేల  స్థాయిని, నిఫ్టీ 8800 స్థాయిని కోల్పోయాయి, ముఖ్యంగా  బ్యాంకింగ్ రంగం లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడింది. అయితే ఫార్మ మాత్రం లాభాలతో మురిపించింది.  సన్ ఫార్మ టాప్ విన్నర్ గా నిలిచింది.  ఇంకా సిప్లా, క్యాడిల్లా హెల్త్ కేర్, అరబిందో ఫార్మ, గెయిల్, భారతి ఇన్  ఫ్రాటెల్, ఎన్టీపీసీ, వేదాంతా, ఓఎన్ జీసీ,  టాటా మోటార్స్, బజాజ్ ఫినాన్స్ లాభపడ్డాయి.  మరో వైపు టీసీఎస్, ఇండస్ ఇండ్, టైటన్, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిం, బ్రిటానియా భారీగా నష్టపోయాయి. (పుంజుకున్న సూచీలు, 9వేల ఎగువకు నిఫ్టీ). 

కాగా ప్రాణాంతక కరోనావైరస్ విజృంభణ,  పెరుగుతున్న కేసులు పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. అందుకే  హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోందన్నారు. 

 చదవండి : కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం
(కరోనా : ట్విటర్ సీఈఓ భారీ విరాళం),  ఉత్పత్తి కోత ఆశలతో పుంజుకున్న చమురు ధర​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement