జేపీ అసోసియేట్‌కు మరో షాక్‌ | SC bars Jaiprakash Associates directors, promoters from transferring personal assets | Sakshi
Sakshi News home page

జేపీ అసోసియేట్‌కు మరో షాక్‌

Nov 22 2017 1:45 PM | Updated on Sep 2 2018 5:18 PM

SC bars Jaiprakash Associates directors, promoters from transferring personal assets  - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్‌ (జెపి) అసోసియేట్స్‌ కు  సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (జైపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ) స్వతంత్ర డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత ఆస్తులను బదిలి చేయడానికి వీల్లేదని ఆదేశించింది. గృహ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలను జారీ చేసింది.  ఈ సందర్భంగా సంస్థ ప్రమోటర్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

గృహకొనుగోలుదారుల ఖర్చుతో మీరు పెరిగారంటూ సుప్రీం ప్రధానన్యాయమూర్తి దీపాక్ మిశ్రా వ్యాఖ్యానించారు.  మంచివాళ్లలాగా డబ్బులు చెల్లించండి..మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల జీవితకాలం పొదుపు సొమ్మును నాశనం  చేయొద్దు.. కొనుగోలుదారులు  డబ్బును తిరిగి  చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.  అప్పు తెస్తారో.. మీ కుటుంబ బంగారు నగలు అమ్ముతారో కానీ... గృహకొనుగోలుదారులకు  చెల్లించాలని ఆదేశించింది.  అలాగే కోర్టు అనుమతి లేకుండా  మొత్తం డైరెక్టర్లు ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు బదిలీ చేయకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘింస్తే తీవ్ర పరిణామాలుంటాయని దీపాక్ మిశ్రా  నేతృత్వంలోని బెంచ్‌ హెచ్చరించింది.  బుధవారం కోర్టు రిజిస్ట్రీతో కంపెనీ రూ .275 కోట్లు డిపాజిట్ చేయగా, కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 1725 కోట్లకు చేరింది. అలాగే రూ. 2,000 కోట్లను వాయిదాల పద్ధతిమీద చెల్లించేందుకు కోర్టు అనుతినిచ్చింది. డిసెంబర్‌ 14 నాటికి రూ.150 కోట‍్లను , డిసెంబరు మాసాంతానికి మరో రూ.125 కోట్లను చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. 13 స్వతంత్ర డైరెక్టర్లు, ప్రమోటర్లు కూడా హాజరు కావాలని ఆదేశించింది.  ఇవాల్టి విచారణకు ఎనిమిది స్వతంత్ర దర్శకులు,  ఐదుగురు ప్రమోటర్లు వ్యక్తిగతంగా  హాజరయ్యారు.

కాగా మొత్తం రూ.2వేల కోట్ల బకాయిలో రూ .400 కోట్ల చెల్లిస్తామన్న జైప్రకాశ్ అసోసియేట్స్ ప్రతిపాదనను గత విచారణలో తిరస్కరించింది. సెప్టెంబర్ 4న జేపీ అసోసియేట్‌ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీ చేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పాటు జేపీ అసోసియేషన్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి వీల్లేదనిన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement