ఆపిల్‌ను కాపీ కొడుతున్న శాంసంగ్‌

Samsung Galaxy S10 To Feature Apple Face ID Like Tech - Sakshi

శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల 10వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది జరుపుకోబోతోంది. ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా శాంసంగ్‌, ఆపిల్‌ను కాపీ కొడుతుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి, శాంసంగ్‌ కూడా తన సిరీస్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని  ప్లాన్‌ చేస్తోందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రిపోర్టు ప్రకారం ఆపిల్‌ ఫేస్‌ ఐడీ టెక్‌ మాదిరి ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని శాంసంగ్‌ క్రియేట్‌ చేస్తుందని, దాని కోసం కొత్త 3డీ కెమెరా ఆల్గారిథంను వాడబోతుందని తెలుస్తోంది. అంతేకాక తన ప్రీమియం ఫోన్లలో అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్లను అమల్లోకి తేవాలని కూడా చూస్తోందని సమాచారం.
  
గెలాక్సీ ఎస్‌10 లేదా గెలాక్సీ ఎక్స్‌ పేర్లతో గెలాక్సీ తన ఎస్‌ సిరీస్‌ 10వ వార్షికోత్సవ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుందని దక్షిణ కొరియా వెబ్‌సైట్‌ బెల్‌ రిపోర్టు చేసింది. ఇప్పటికే 3డీ సెన్సింగ్‌ ఇంటిగ్రేషన్‌ను అందించడం కోసం, శాంసంగ్‌ ఇజ్రాయిల్‌ కెమెరా ఎక్స్‌పర్ట్‌ మాంటిస్‌ విజన్‌, జపనీస్‌ మాడ్యుల్‌ మానుఫ్రాక్ట్ర్చరర్‌ నముగతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం అందిస్తున్న 2డీ సెన్సింగ్‌ టెక్నాలజీ నుంచి శాంసంగ్‌ బయటికి వచ్చేయాలని చూస్తుందని రిపోర్టులు తెలిపాయి. మరోవైపు శాంసంగ్‌ పనిచేస్తున్న అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్లు, అంతకముందు వివో తన ఎక్స్‌20 ప్లస్‌ యూడీలో అందించింది. అయితే ఈ సెన్సార్లను టెక్నికల్‌ సవాళ్ల వల్ల శాంసంగ్‌ తన గెలాక్సీ నోట్‌ 9లో అందించకపోవచ్చని తెలుస్తోంది. కాగ, గెలాక్సీ ఎస్‌9కు సక్ససర్‌గా శాంసంగ్‌ తన10వ జనరేషన్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top