గెలాక్సీ ఏ6ప్లస్‌పై మరోసారి ధర తగ్గింపు

Samsung Galaxy A6+ Price Cut In India Again - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ ఏ6ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై మరోసారి ధర తగ్గింది. జూలైలో మొదటిసారి ధర తగ్గిన అనంతరం, తాజాగా మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల రూపాయల మేర ధర తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది. దీంతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ6ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 21,990 రూపాయలకు దిగొచ్చింది. లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 25,990 రూపాయలుగా ఉండేది. జూలైలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల రూపాయల ధర తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని రంగుల వేరియంట్లు కొత్త ధరలతో లిస్ట్‌ అయి ఉన్నాయి. కొత్త ధరలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ6ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌ ఇండియా సైట్‌, పేటీఎం మాల్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్‌, బ్లూ, గోల్డ్‌ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. 

గెలాక్సీ ఏ6ప్లస్‌ స్పెషిఫికేషన్లు...
డ్యూయల్‌ సిమ్‌(నానో) స్మార్ట్‌ఫోన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
16 మెగాపిక్సెల్‌+5మెగాపిక్సెల్‌ సెన్సార్లతో రెండు వెనుక కెమెరాలు
24 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top