తగ్గింపు ధరలో శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు

Samsung Galaxy A30, Galaxy A20, Galaxy A10 Price in India Cut  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణకొరియా ఎల‌క్ట్రానిక్స్  దిగ్గజం శాంసంగ్ త‌న గెలాక్సీ  ఫోన్లపై  తగ్గింపు ధరలనుప్రకటించింది.  భార‌త్‌ మార్కెట్లో  గెలాక్సీ   ఏ సిరీస్‌లో ఇటీవల లాంచ్‌ చేసిన ఎ10, ఎ20, ఎ30 ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచామని  సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో లాంచ్‌ ఈ స్మార్ట్‌ఫోన్లపై ఇదే తొలి అధికారిక ధర తగ్గింపు. 

గెలాక్సీ ఎ10  : రూ.500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.7,990 ధ‌ర‌కు ల‌భించనుంది.
గెలాక్సీ ఎ20 : వెయ్యి రూపాయల  త‌గ్గింపు  అనంతరం  రూ.11,490 లభ్యం
గెలాక్సీ ఎ30 : రూ.1500 త‌గ్గింపు ధ‌ర‌తో రూ.15,490 ధ‌ర‌కు లభ్యం కానుంది.

శాంసంగ్‌, అమెజాన్‌తో పాటు అన్ని ఆన్‌లైన్‌ స్టోర్లలో ప్ర‌స్తుతం ఈ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చని శాంసంగ్‌ వెల్లడించింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top