అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6! | sale of IPhone6 Vendors through E-commerce | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!

Oct 2 2014 5:09 PM | Updated on Aug 20 2018 2:55 PM

అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6! - Sakshi

అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!

ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. ఎప్పటి నుంచి భారత్ లో అమ్మకాలు ప్రారంభించే అంశంపై ఆపిల్ కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఈ కామర్స్ లో ఈబే సంస్థ ఐఫోన్ 6 ధర 55954 రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 8 తేది నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఆ కంపెనీ నిర్వహకులు వెల్లడించారు. 
 
షాప్ క్లూ.కామ్ అనే మరో సంస్థ 16 జీబీ కెపాసిటి ఐఫోన్6 ధర 59999 వేల రూపాయలుగా, షిప్పింగ్ చార్జీలు 148 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 8 తేదికల్లా 'ఐఫోన్ 6'ను అందిస్తామని షాప్ క్లూ.కామ్ భరోసానిస్తోంది. సెప్టెంబర్ 9 తేదిన మార్కెట్ లోకి విడుదల చేసిన ఆపిల్ కంపెనీ... భారత్ లో అక్టోబర్ చివర్లోగాని, నవంబర్ లోకాని ఐఫోన్6 అమ్మకాల్ని కొనసాగిస్తామని వెల్లడించింది. అమెజాన్, ఇతర కంపెనీలు కూడా ఐఫోన్6 అమ్మకాల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement