
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ మరోసారి అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. మంగళవారం ఆరంభంలో పాజిటివ్ నోట్‌తో ట్రేడ్‌అయినా ఆ తరువాత అమ్మకాలతో కుదేలైంది. బ్రెంట్ క్రూడ్ ధర మరోసారి 84 డాలర్లను అధిగమించడంతో తర్వాత అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో మిడ్‌సెషన్ తరువాత మంగళవారం మధ్యాహ్నం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 74.27 శాతానికి పడిపోయింది.
దిగుమతిదారులనుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పుంజుకోవడం, ద్రవ్య లోటు పెరగడం, పెట్టుబడుల ఉపసంహరణలు దేశీయ కరెన్సీపై భారం పెరగడంతో ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించింది.