టర్కీ షాక్‌ : ఆల్‌ టైం కనిష్టానికి రూపాయి

Rupee At All-Time Low Of 69.62 Against US Dollar Amid Turkey Crisis - Sakshi

టర్కీ సంక్షోభం

రూపాయి భారీ పతనం

ఆల్‌ టైం కనిష్టానికి రూపాయి విలువ

69.70  స్థాయికి పతనం

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి భారీ పతనాన్ని నమోదు చేసింది. డాలర్‌తో పోల్చుకుంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.62  స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లైఫ్‌టైం కనిష్టానికి  చేరింది.  ప్రస్తుతం 85 పైసల నష్టంతో 69.70 స్థాయి వద్ద  రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది.  చైనా, యూరోపియన్‌ దేశాలతో వాణిజ్య వివాదాలకు తెరతీసిన అమెరికా ప్రభుత్వం గత వారం టర్కీపై కూడా కత్తి దూసింది. ఆ దేశ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ ఒక్కసారిగా  ఘోరపతనాన్ని నమోదుచేసింది. డాలరు మారకంలో  టర్కీ కరెన్సీ టర్కీష్‌ లిరా  ఈ ఏడాదిలో  45శాతం కుప్పకూలింది. 

టర్కీ అధ్యక్షుడు టయిప్ ఎర్డోగాన్ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న నియంత్రణ, అమెరికాతో దౌత్యపరమైన విభేదాలపై ఆందోళనల కారణంగా  ఇన్వెస్టర్లు  సెంటిమెంట్‌ బాగా దెబ్బతింది. రూపాయి విలువకు కీలకమైన స్థాయి 69.80 డాలర్లుగా ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మరోవైపు టర్కీ ఆర్థిక సంక్షోభం, రూపాయి పతనం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్‌ 176 పాయింట్లు క్షీణించి 37,692, నిఫ్టీ 56 పాయింట్లనష్టంతో 11, 373వద్దకొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top