విదేశీ మార్కెట్లో బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) బుధవారం 75 కోట్ల డాలర్లను(దాదాపు రూ.4,624 కోట్లు) సమీకరించింది.
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లో బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) బుధవారం 75 కోట్ల డాలర్లను(దాదాపు రూ.4,624 కోట్లు) సమీకరించింది. 4.875 శాతం వడ్డీరేటుతో జారీ చేసిన ఈ బాండ్ల కాలపరిమితి 30 ఏళ్లు. ఆసియాలో ఒక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ ఆఫర్ చేసిన అత్యంత తక్కువ రేటు ఇదేనని అంచనా. కాగా, కొత్త ఏడాదిలో కంపెనీ ఇంత భారీ మొత్తంలో నిధులను సమీకరించడం ఇది రెండోసారి. జనవరి 22న విదేశీ బాండ్ ఇష్యూతో 100 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది.
పదేళ్ల కాలపరిమితిగల ఈ బాండ్లను 4.125 శాతం వడ్డీరేటుకు విక్రయించింది. గత ఏడాది(2014) కూడా రిలయన్స్ విదేశీ బాండ్‌ల జారీతో 330 కోట్ల డాలర్లకు పైగా(దాదాపు రూ.20,500 కోట్లు) భారీ నిధులను సమీకరించింది. .