foreign market
-
మార్కెట్ పై క్రూసేడ్!
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి 422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ధరల మంట... లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్‌లో లైట్ స్వీట్ క్రూడ్ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్‌సెషన్‌కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి. మరోపక్క యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్ క్రూడ్ 36 శాతం, బ్రెంట్ 28 శాతం జంప్ చేయడం తెలిసిందే. అమ్మకాల షాక్: ఎన్ఎస్ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్, కెమికల్స్ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ, కొటక్ బ్యాంక్ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 1.6–0.6 మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్‌లైన్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు రెక్కలురానుండటంతో ఆర్బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు సెగతో చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్ పెయింట్స్ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్ వ్యయాలపై భయాలతో ఇంటర్‌గ్లోబ్ 4 శాతం పడింది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుయుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం. -
రూ.4,624 కోట్లకు రిలయన్స్ విదేశీ బాండ్లు
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లో బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) బుధవారం 75 కోట్ల డాలర్లను(దాదాపు రూ.4,624 కోట్లు) సమీకరించింది. 4.875 శాతం వడ్డీరేటుతో జారీ చేసిన ఈ బాండ్ల కాలపరిమితి 30 ఏళ్లు. ఆసియాలో ఒక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ ఆఫర్ చేసిన అత్యంత తక్కువ రేటు ఇదేనని అంచనా. కాగా, కొత్త ఏడాదిలో కంపెనీ ఇంత భారీ మొత్తంలో నిధులను సమీకరించడం ఇది రెండోసారి. జనవరి 22న విదేశీ బాండ్ ఇష్యూతో 100 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. పదేళ్ల కాలపరిమితిగల ఈ బాండ్లను 4.125 శాతం వడ్డీరేటుకు విక్రయించింది. గత ఏడాది(2014) కూడా రిలయన్స్ విదేశీ బాండ్ల జారీతో 330 కోట్ల డాలర్లకు పైగా(దాదాపు రూ.20,500 కోట్లు) భారీ నిధులను సమీకరించింది. . -
మూడో రోజు బలపడిన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో శుక్రవారం 35 పైసలు (0.56 శాతం) బలపడింది. 62.32 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 62.29 స్థాయిని సైతం తాకింది. రూపాయి గురువారం ముగింపు 62.67. వరుసగా మూడు రోజుల నుంచీ రూపాయి బలపడుతూ వస్తోంది. ఈ మూడు రోజుల్లో రూపాయి 125 పైసలు (1.97 శాతం) బలపడింది. డాలర్ అమ్మకాలు, దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. విదేశీ మార్కెట్లలో డాలరు బలహీనత కూడా రూపాయి విలువ పెరగడానికి కలసి వస్తోంది. -
‘డాలర్ల’ పూదోటలో నష్టాల ముళ్లు
డిమాండ్ కోల్పోయిన కుప్పం రోజా విదేశీ మార్కెట్లో పతనమైన ధర పూల నాణ్యతలో లోపమే శాపం నీళ్లు చాలక కళావిహీనమైన గ్రీన్‌హౌస్‌లు కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 40 పైగా గ్రీన్‌హౌసుల్లో రైతులు రోజా పూలతోటలు సాగు చేస్తున్నారు. విదేశాల్లో గత ఏడాది వరకు కుప్పం రోజా పూలకు డివూండు అధికంగా ఉండేది. రైతులు కూడా రోజా పూలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి ధర పలికినప్పుడు విదేశాలకు ఎగువుతి చేశారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా తయరయింది. గత ఏడాది రోజా పువ్వు ధర రూ.150-200లు పలికింది. ఈ ఏడాది దాని ధర రూ.50 నుంచి రూ.100లోపే ఉంది. అంటే విదేశీ వూర్కెట్లో కుప్పం పూలకు డిమాండు తగ్గిపోయింది. గతంలో బాగా లాభాలు చవిచూడడమేగాకుండా, గ్రీన్హౌస్లో ఒకసారి ఏ పంట సాగుచేస్తే కొన్నేళ్లపాటు అదే పంటసాగు చేయాలి. దీంతో రైతులు గిట్టుబాటు ధరలేని రోజా పూలతోటలు సాగుచేయలేక, వురో పంటసాగుచేయలేక అయోమయాంలో పడ్డారు. ఖర్చులెక్కువ గ్రీన్హౌస్లో రోజా పూలు సాగుచేయాలంటే ఖర్చు భారీ ఎత్తున ఉంటుంది. గ్రీన్హౌస్ ఏ ర్పాటుకే 10 లక్షలు పైబడుతుంది. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తుంది. మిగతా ఖర్చు మొత్తం రైతు భరించాల్సిందే. పూలసాగుకు ఎకరానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. రోజూ ఇద్దరు ముగ్గురు కూలీలు గ్రీన్హౌస్లో పనిచేయాలి. వీరి కూలి భరించాలి. కోసిన పూలను కోల్డ్‌స్టోరేజిలో ఉంచాలి. అందుకు అద్దె ఇవ్వాలి. తరువాత మార్కెట్‌కు తరలించే ఖర్చు. ఇదంతా భరిస్తే చివరకు కష్టానికి తగిన ఫలితం రావడం లేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వెల్వెట్ పరిస్థితీ ఘోరం రోజాకు తోడు వెల్వెట్(కోడి జుట్టు) పూల ప రిస్థితి దారుణంగా తయారయింది. ఎకరా భూమిలో వెల్వెట్ పూలు సాగుచేస్తే 500 కిలోల నుంచి 600 కిలోల వరకు పూలుపూస్తాయి. కానీ ఈసారి 300నుంచి 400 కిలోలలో పే పూలు పూస్తున్నాయి. గతంలో ఒక కోతకు 25 వేల నుంచి 30 వేల రూపాయల దాకా గిట్టుబాటు అయ్యేది. ఈ ఏడాది వెల్వెట్ పూలు అడిగే నాథుడే లేదంటున్నారు రైతులు. కుప్పం మండల పరిధిలోని వెండుగంపల్లె గ్రామానికి చెందిన వుునెప్ప ఎకరం భూమిలో వెల్వెట్ పూలు అమ్ముకోలేక పొలంలోనే వదిలేశాడు. వారం కిందట ఓ బస్తా వెల్వెట్ పూలు స్థానిక వూర్కెట్కు తీసుకెళితే ఎవరు కొనలేదని నిరుత్సాహంతో వెనుతిరిగాడు. నీటి సమస్యతో నాణ్యత లోపం నాణ్యతలో లోపం ఏర్పడడంతోనే రోజా, వెల్వెట్ పూలు ధరలు పతనమయ్యూయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా పడకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా గ్రీన్హౌస్లో పూల మొక్కలకు నీటిని సరఫరాచేస్తే పూలలో నాణ్యత రావడంలేదు. గ్రీన్‌హౌస్‌లు కూడా కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నీటి కొరతతోనే ఇబ్బంది వానలు లేక బోర్లన్నీ ఎండిపోయూయి. గ్రీన్హౌస్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించే నీరు పూలమొక్కలకు చాలడం లేదు. అందువల్లే పూలు నాణ్యతగా రాలేదు. దీనికితోడు కుప్పం నుంచి విదేశాలకు ఎగువుతి చేసేందుకు సౌకర్యాలు లేకపోవడం వల్ల రోజా పూలకు గిట్టుబాటు ధర రాలేకపోతోంది. మొదట్లో బాగున్న రోజా పూలసాగుతో ఇప్పుడు అనుకున్న స్థాయిలో లాభాలు రావడం లేదు. -తులసి,రైతు,కొత్తిండ్లు ధర లేకపోవడంతో పొలాల్లోనే వదిలేశాం వెల్వెట్ పూలను వూర్కెట్లో అడిగేవారు లేరు. వారం రోజుల కింద ఒక పూట పూలు మార్కెట్‌కు ఎత్తుకుని పోతే తీసుకునేవారు లేక అక్కడే పారబోసి వచ్చాం. రే ట్లు లేకపోవడంతో పూలు కోయులేక పొలాల్లోనే వదిలేశాం. గత ఏడాదికంటే ఈ దఫా సాగుచేసిందే తక్కువ. కానీ,ఈ సారే నష్టాలు ఎక్కువ. -పుంగోడి,వెండుగంపల్లె


