జియో: 12 వేల నిమిషాల టాక్ టైం

Reliance Jio prepaid plans: 12000 minutes of Jio to non Jio calling - Sakshi

జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ 

ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం

2599 రూపాయల ప్లాన్ లో డిస్నీ + హాట్‌స్టార్ వార్షిక చందా ఉచితం

సాక్షి, ముంబై: గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ)లను వడ్డించిన రిలయన్స్ జియో కొత్త పథకాలతో తన వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్  ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. (జియో ఫైబర్ ఆఫర్ : జీ5 ప్రీమియం ఉచితం)

రిలయన్స్ జియో  ప్రీపెయిడ్ ప్లాన్స్
2599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇది వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్‌ అదనంగా అందిస్తుంది. అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ  డేటాను  వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు. అలాగే డిస్నీ + హాట్‌స్టార్ వార్షిక ఉచిత చందా .

2399రూపాయల  ప్రీపెయిడ్ ప్లాన్: ఇది కూడా వార్షిక చందానే. నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాలు. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభ్యం. అయితే ఈ ప్లాన్‌లో 10జీబీ అదనపు డేటాను లేదా డిస్నీ + హాట్‌స్టార్‌కు సభ్యత్వం లభించదు. 

2121 రూపాయల  ప్రీపెయిడ్ ప్లాన్: 336 రోజుల  వాటిడిటీ, నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాల టాక్ టైం అదిస్తుంది. రోజు  1.5 జీబీ డేటా, ఎస్‌ఎంఎస్‌లు లభ్యం. 

1299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ కూడా 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం ఈ ప్లాన్‌లో 24  జీబీ డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు 

4999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం అందిస్తుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top