పండుగ ఆఫర్‌ను పొడిగించిన జియో

Reliance Jio extends festive offer on JioFi 4G Wi-Fi dongle

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో తన పోర్టబుల్‌ వై-ఫై హాట్‌స్పాట్‌ జియోఫై పై గత నెలలో పండుగ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో తన డోంగల్‌ను కేవలం రూ.999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసిన క్రమంలో ఈ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్టు జియో పేర్కొంది. ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. '' పండుగ సెలబ్రేషన్లను కొనసాగిస్తున్నాం. మీ జియోఫై డివైజ్‌ను తగ్గించిన ధర రూ.999కే కొనుగోలు చేయండి. డిస్కౌంట్‌ ధరలో దీని కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు మరింత కాలం అందిస్తున్నాం'' అని కంపెనీ ట్వీట్‌ చేసింది.

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్‌ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం గత ఏడాది మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది. జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్‌ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. 10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. 

Back to Top