‘జియోఫై’ పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Reliance Jio Announces JioFi Exchange Offer - Sakshi

జియోఫై ఫ్యామిలీ విస్తరణలో భాగంగా రిలయన్స్‌ కొత్త జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్‌ డివైజ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. 999 రూపాయల ధర కలిగిన ఈ డివైజ్‌పై జియో సరికొత్త ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత ఆఫర్‌ ప్రకారం 999 రూపాయలకు లభించే జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేసేటపుడు మన దగ్గర ఉన్న పాత డోంగల్‌/ మోడమ్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం..
ఈ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ పొందాలంటే మొదట జియో స్టోర్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో జియోఫై డోంగల్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత జియో సిమ్‌ను యాక్టివేట్‌ చేసి రూ.198 లేదా 299 రూపాయలతో రీచార్జ్‌ చేసుకోవాలి. జియోప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కోసం అదనంగా మరో 99 రూపాయలు చెల్లించాలి.

నాన్‌ జియో డోంగల్‌ను  ఎక్స్చేంజ్‌ చేసుకునేటపుడు.. ఆ డోంగల్‌ సీరియల్‌ నెంబర్‌ను పొందపరచాలి. అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసిన జియోఫై ఎమ్‌ఎస్‌డీఎన్‌ (MSDN) నంబర్‌ను కూడా జత చేయాలి. అలా అయితేనే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా ‘మైజియో’ అకౌంట్‌లో 2,200 రూపాయలు క్రెడిట్‌ అవుతాయి. కానీ ఈ మొత్తమంతా ఒకేసారి క్రెడిట్‌ కాకుండా 50 రూపాయల విలువ గల 44 వోచర్లు లభిస్తాయి.  

కాగా ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టిన జియోఫై 4జీ ఎల్‌టీఈ హాట్‌స్పాట్‌ డివైజ్‌పై ఏడాదిపాటు వారెంటీ ఉంది. దీని డౌన్‌లోడ్‌ స్పీడు 150ఎంబీపీఎస్‌, అప్‌లోడ్‌ స్పీడు 50ఎంబీపీఎస్‌. ‘డిజైన్డ్‌ ఇన్‌ ఇండియా’ అనే ట్యాగ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ డివైజ్‌.. పవర్‌ ఆఫ్‌/ఆన్‌ చేయడానికి ఫిజికల్‌ బటన్లను, డబ్ల్యూపీఎస్‌, బ్యాటరీ కోసం నోటిఫికేషన్‌ లైట్స్‌ను కలిగి ఉంది. హై-స్పీడు డేటా నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అవడానికి 32 మంది యూజర్లకు ఈ డివైజ్‌ అనుమతి ఇస్తుంది. ఒక్కసారి కనెక్ట్‌ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్‌ యాప్‌తో హెచ్‌డీ వాయిస్‌, వీడియో కాల్స్‌ను ఇది ఆఫర్‌ చేస్తుంది. అంతేకాక ఏఎల్‌టీ3800 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డివైజ్‌ ఎఫ్‌డీడీ బ్యాండ్‌ 3, బ్యాండ్‌ 5, టీడీడీ-బ్యాండ్‌ 40లను సపోర్టు చేస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top