సూపర్‌ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మి వై3

Redmi Y3, Redmi 7 to Launched - Sakshi

షావోమి రెడ్‌మి సిరీస్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  రెడ్‌మి వై సిరీస్‌లో భాగంగా వై 2 తరువాత రెడ్‌మి వై3 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది.  32 ఎంపీ  సూపర్‌ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ సెంట్రిక్ డివైస్‌గా రెడ్‌మి వై 3ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.

ధరలు: 

3జీబీ ర్యామ్‌ , 32 జీబీ స్టోరేజ్‌  = రూ. 9999
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ = రూ. 11,999

30, ఏప్రిల్‌ నుంచి  అమెజాన్‌, ఎంఐ, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా లభ్యం.  రెడ్‌ మి వై 3 కొనుగోలుదారులకు ఎయిర్‌టెల్‌  ద్వారా 1000 జీబీ  4జీ డేటా ఉచితం, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. 

రెడ్‌మి  వై 3 ఫీచర్లు
6.26 డాట్‌నాచ్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌  కాల్కామ్‌ 632 సాక్‌ 
ఆండ్రాయిడ్‌ పై 9
1440x720  పిక్సెల్స్‌ స్ర్కీన్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
32 ఎంపీ  సూపర్‌ సెల్ఫీ కెమెరా
12+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top