రిక్రూటర్లకు వారే అతిపెద్ద సవాల్‌

Recruiters find senior level hiring a challenge: Survey - Sakshi

ముంబై : కంపెనీల్లో ఉద్యోగులను నియమించుకోవాలంటే రిక్రూటర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. సీనియర్‌ స్థాయి ఉద్యోగుల నియమించుకునేటప్పుడైతే, ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. రిక్రూటర్లకు ప్రస్తుతం సీనియర్‌ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడం అతిపెద్ద సవాల్‌గా నిలుస్తుందని, ఈ అభ్యర్థులు ప్రస్తుత వేతనానికి 20 నుంచి 40 శాతం పెంపు కోరుకుంటున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మెజార్టీ సీనియర్‌ స్థాయి ఉద్యోగులు, తమ ప్రస్తుత వేతనానికి 20 శాతం నుంచి 40 శాతం పైగా పెంపు ఉంటేనే ఉద్యోగ మార్పును పరిగణలోకి తీసుకుంటున్నారని సీఐఈఎల్‌ నిర్వహించిన టాలెంట్‌ మార్కెట్‌పై ఏడాది సర్వే వెల్లడించింది.  ఇది భవిష్యత్తులో ఉద్యోగవకాశాల విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

ప్రతిభావంతులను ఆకర్షించుకోవడం కూడా రిక్రూటర్లకు అతిపెద్ద సవాల్‌ అని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పలు రంగాల్లో వివిధ స్థాయిలోని 107 ఎగ్జిక్యూటివ్‌లపై ఈ సర్వే నిర్వహించింది. కేవలం సీనియర్‌ ఉద్యోగులను నియమించుకోవడమే కాక, రిక్రూటర్లకు ఎంప్లాయర్‌ బ్రాండింగ్‌ కూడా సవాల్‌గా నిలుస్తుందని సర్వే బహిర్గతం చేసింది. 35 శాతం మంది దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారన్నారు. ఎంట్రీ లెవల్‌, మధ్య స్థాయి వారికి కొత్త ఉద్యోగవకాశాలు చూడటం, వేతనాలు, ప్రయోజనాలు వంటివి అత్యంత ముఖ్యమైన కారకాలు కాగ, సీనియర్‌ స్థాయి వారికి వేతనం, ఇతరాత్ర ప్రయోజనాలు రెండో అతిపెద్ద కారకాలని సర్వే పేర్కొంది. కొత్త ఉద్యోగాలు వెతుకోవడానికి మరో ముఖ్యమైన అంశం మేనేజర్లతో సంబంధాలని కూడా తెలిపింది. కెరీర్‌లో వెదకడం కోసం కూడా ఉద్యోగం మారుతున్నట్టు చెప్పింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top