ప్రీపెయిడ్‌ సాధనాల పరిమితి నెలకు రూ. 50,000

Prepaid Tools limit is Rs. 50,000

ముంబై: మొబైల్‌ వాలెట్లు తదితర ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ)లో నెలకు రూ. 50,000కు మించి లోడ్‌ చేయరాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. అలాగే వీటిని జారీ చేసే సంస్థలు పీపీఐ బ్యాలెన్స్‌లపై వడ్డీ చెల్లించడానికి లేదని స్పష్టం చేసింది. మీల్‌ వోచర్లు మినహా పీపీఐలను పేపర్‌ రూపంలో జారీ చేయరాదని కూడా సూచించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత ఈ వోచర్లు కూడా ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లోనే జారీ చేయాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

మరోవైపు పీపీఐల ఇంటర్‌ఆపరబిలిటీని దశలవారీగా అమల్లోకి తెస్తామని వివరించింది. ఆరు నెలల్లోగా వివిధ సంస్థల వాలెట్స్‌కి.. ఆ తర్వాత వాలెట్లు, బ్యాంకులకు మధ్య కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. తాజా ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top