ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో | PepsiCo to focus on health related drinks | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో

Jun 10 2016 1:10 AM | Updated on Sep 4 2017 2:05 AM

ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో

ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో

శీతల పానీయాల ప్రముఖ తయారీ సంస్థ పెప్సికో ఆరోగ్య పరమైన డ్రింక్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

న్యూఢిల్లీ: శీతల పానీయాల ప్రముఖ తయారీ సంస్థ పెప్సికో ఆరోగ్య పరమైన డ్రింక్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజు రోజుకి వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త డ్రింక్స్, తినుబంఢారాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో హైడ్రేషన్, ఫంక్షనల్ డ్రింక్స్‌కు మార్కెట్ అవకాశాలున్నాయని పెప్సికో బెవరేజ్ క్యాటగిరి ఇండియా వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఫంక్షనల్ డ్రింక్స్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు లక్ష్యంగా మౌంటెన్ డ్యూ బ్రాండ్‌లో గేమ్ ఫ్యూయల్ డ్రింక్‌ను గురువారం విడుదల చేసింది. ‘గేమ్ ఫ్యూయల్‌ను అమెరికా తర్వాత భారత్‌లోనే విడుదల చేసాం. ఈ ఏడాది చివరికల్లా మరో 2 కొత్త ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తీసుకువస్తాం’ అని విపుల్ ప్రకాశ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement