ఈ ఏడాది 200 కోట్ల లావాదేవీలు: పేటీఎం | Paytm to complete 2 billion transactions this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 200 కోట్ల లావాదేవీలు: పేటీఎం

Dec 9 2016 12:27 AM | Updated on Sep 4 2017 10:14 PM

ఈ ఏడాది 200 కోట్ల లావాదేవీలు: పేటీఎం

ఈ ఏడాది 200 కోట్ల లావాదేవీలు: పేటీఎం

అంచనాలు మించి ప్రస్తుత సంవత్సరం 200 కోట్ల పైగా లావాదేవీలు నమోదు చేయనున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

అమెరికా మార్కెట్‌పై కూడా దృష్టి
బెంగళూరు: అంచనాలు మించి ప్రస్తుత సంవత్సరం 200 కోట్ల పైగా లావాదేవీలు నమోదు చేయనున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. గతంలో రోజుకు 25-30 లక్షల లావాదేవీలు జరిగేవని, డీమోనిటైజేషన్ పరిణామాల అనంతరం ప్రస్తుతం 50-60 లక్షల పైగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కూడా తోడైతే ప్రతి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ యాప్‌గా సేవలు అందించే స్థారుుకి ఎదగాలని నిర్దేశించుకున్నట్లు శర్మ విలేకరుల సమావేశంలో వివరించారు.

టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శర్మ సూచించారు. దీర్ఘకాలంలో అమెరికా మార్కెట్లో కూడాకి విస్తరించాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. మరోవైపు, పేమెంట్ బ్యాంక్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని, మార్చ్ 2017లోగా దీన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement