పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ప్రత్యేకతలివే!

Paytm Payments Bank launched officially - Sakshi

డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ పేటీఎం అధికారికంగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు లావాదేవీలను లాంచ్‌ చేసింది. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధింపు లేకుండా ప్రారంభమైన దేశంలోనే తొలి బ్యాంకు ఇదే. ఈ అకౌంట్లకు ఎలాంటి మినిమమ్‌ బ్యాలెన్స్‌ కూడా అవసరం లేదు. దేశంలోనే మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి ఇది లాంచ్‌ చేసినట్టు తెలిపింది. పాపులర్‌ పేటీఎం వాలెట్‌ యాప్‌లో ఇది అంతర్భాగమని పేటీఎం పేర్కొంది. 2018 నాటికి లక్ష లావాదేవీలకు ఇది సౌకర్యం కల్పిస్తుందని పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ అంచనావేస్తున్నారు. ఈ కొత్త బ్యాంకులో శర్మ మెజార్టీ వాటాను కలిగి ఉన్నారు. మిగతా షేరు వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ కలిగి ఉంది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ప్రత్యేకతలు..

  • బ్రేకింగ్‌ ఎఫ్‌డీలపై పెనాల్టీ ఉండదు.
  • ఖాతాల్లో నగదుకు కనీసం 4 శాతం వడ్డీ నుంచి 7.03 శాతం వరకు వడ్డీ ఆర్జించవచ్చు.
  • మరణించడం లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షల వరకు ఉచితంగా ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఆఫర్‌
  • దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసే పేటీఎం ఏటీఎంలలో లక్ష రూపాయల వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఐఎంపీఎస్‌, యూపీఐ, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌ వంటి డిజిటల్‌ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలుండవు.
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాదారులకు ఉచితంగా డిజిటల్‌ డెబిట్‌ కార్డు
  • పేమెంట్స్‌ బ్యాంకు డిపాజిట్లను స్వీకరిస్తుంది. కానీ రుణాలు ఇవ్వదు.
  • దేశవ్యాప్తంగా ఈ బ్యాంకు ఈ ఏడాది ముగింపు నాటికి 31 లక్షల శాఖలను కలిగి ఉండనుంది.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top