ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం | OBC posts Q4 net loss of Rs178 crore, stock jumps 7.6% | Sakshi
Sakshi News home page

ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం

May 15 2015 1:56 AM | Updated on Oct 8 2018 7:36 PM

ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం - Sakshi

ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మార్చి క్వార్టర్‌లో రూ.178 కోట్ల నష్టం పొందింది.

న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మార్చి క్వార్టర్‌లో రూ.178 కోట్ల నష్టం పొందింది. 2013-14 క్యూ4లో రూ.310కోట్ల లాభాన్ని ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.99 శాతం నుంచి 5.18 శాతానికి పెరిగాయి. నష్టాలు వచ్చినప్పటికీ, 33 శాతం డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. కాగా ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,139 కోట్ల నుంచి 56 శాతం క్షీణించి రూ.497 కోట్లకు తగ్గిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.20,963 కోట్ల నుంచి రూ.22,083 కోట్లకు పెరిగిందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement