మరో హైఎండ్‌ నోకియా స్మార్ట్‌ఫోన్‌ | Nokia 9 may join the flagship smartphone race  | Sakshi
Sakshi News home page

మరో హైఎండ్‌ నోకియా స్మార్ట్‌ఫోన్‌

Oct 13 2017 2:11 PM | Updated on Oct 13 2017 2:21 PM

Nokia 9 may join the flagship smartphone race 

హెచ్‌ఎండీ ఇప్పటికే నాలుగు నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. తన హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా మరో హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ త్వరలోనే విడుదల చేయబోతుందని తెలుస్తోంది. నోకియా 9 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిన్నిష్‌ కంపెనీ రూపొందిస్తుందని రిపోర్టు వెల్లడిస్తున్నాయి. స్లీక్‌ డిజైన్‌తో ఇది రూపొందుతుందని, పలుచనైన బెజెల్‌, డ్యూయల్‌ కెమెరాలతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. నోకియా 8 తర్వాత డ్యూయల్‌ కెమెరాతో రాబోతున్న రెండో స్మార్ట్‌ఫోన్‌ నోకియా 9. 

12 లేదా 13 మెగాపిక్సెల్‌ లెన్స్‌, స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లతో ఇది మార్కెట్‌లోకి రాబోతుందని తెలుస్తోంది. నోకియా 8 కంటే ముందు నుంచి నోకియా 9పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లీక్స్‌ షేర్‌ చేసిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌ పరిమాణాలు 140.9 ఎంఎం (ఐ) x 72.9 ఎంఎం (డబ్ల్యూ) x 7.5 ఎంఎం (డీ)గా ఉంటాయట. ఇది చాలా పలుచగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకురాబోతుందట. దీంతో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ రేసులోకి ఇది ప్రవేశించబోతుందట. నోకియా 8 అమ్మకాలు నేటి నుంచి యూరప్‌, భారత్‌లలో ప్రారంభం కాబోతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement