హీరో కొత్త గ్లామర్.. ధరెంతో తెలుసా? | New Hero Glamour goes on sale in India at Rs 57,775 | Sakshi
Sakshi News home page

హీరో కొత్త గ్లామర్.. ధరెంతో తెలుసా?

Apr 15 2017 11:12 AM | Updated on Sep 5 2017 8:51 AM

దేశీయ ఆటో దిగ్గజం హీరో... తన గ్లామర్ బైక్ కు మరింత గ్లామర్ అద్దింది.




న్యూఢిల్లీ:
దేశీయ ఆటో దిగ్గజం హీరో... తన గ్లామర్ బైక్ కు మరింత గ్లామర్ అద్దింది.. కొత్త స్టైల్ లో గ్లామర్ ను అప్ డేట్ చేసింది. బీఎస్-4 కంప్లియంట్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ తో హీరో తన కొత్త గ్లామర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బైకు అమ్మకాలను భారత్ లో ప్రారంభించింది. ఈ కొత్త మోటారో సైకిల్ ను కంపెనీ ఈ ఏడాది మొదట్లో అర్జెంటీనా ఈవెంట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇవి డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉన్నాయి. 
 
రెండు వేరియంట్లలో ఇది డీలర్ షిప్ వద్ద అందుబాటులో ఉంది. ఒకటి డ్రమ్ బ్రేక్, రెండు డిస్క్ బ్రేక్. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.57,755(ఎక్స్ షోరూం, ఢిల్లీ) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటార్ సైకిల్ ధర 59,755 రూపాయలు.  ఈ కొత్త గ్లామర్ బైకు గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కేవలం బైకు తయారీ డీలర్ షిప్స్ మాత్రమే దీనిపై స్పందిస్తున్నారు.
 
కేవలం భారత్ మార్కెట్లోనే కాక, దక్షిణ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. కొత్త స్టైల్ లో తీసుకొచ్చిన గ్లామర్ ను, ఆటో గ్రాఫిక్స్ దగ్గర నుంచి ఎల్లాయ్ వీల్స్ వరకు మొత్తం లుక్‌నే మార్చేసింది హీరో. బ్లాక్ కోటెడ్ హ్యాండిల్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, కొత్త ఎల్లాయ్ వీల్స్, స్టైలిస్ టెయిల్ డిజైన్, కొత్త మీటర్ కన్సోల్ దీనిలో ప్రధాన ఆకర్షణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement