ఆధునిక ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌

Motorola One Vision full specifications Price Leaked Ahead of May 15 launch  - Sakshi

మోటరోలా వన్‌ విజన్‌

మే 15న బ్రెజిల్‌లో లాంచ్‌ ధర  సుమారు రూ.23,400

మోటరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను  త్వరలోనే  గ్లోబల్‌ మార్కెట్‌లో  లాంచ్‌ చేయనుంది. ‘వ‌న్ విజన్‌’  పేరుతో  ను ఈ నెల 15వ తేదీన బ్రెజిల్ సావోపోలోలో జ‌ర‌గ‌నున్న ఓ ఈవెంట్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో సుమారు రూ.23,400 ధ‌ర‌కు ఈ ఫోన్‌ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.  ప్రధానంగా  హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే, 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌ రియర్‌  కెమెరా లాంటి  ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది.  దీంతో పాటు మోటో ఈ6  పేరుతో  మరో  స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్‌ చేయనుందని సమాచారం.  అయితే రిలీజ్‌కు ముందే  వన్‌ విజన్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫోటోల లీకులు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

మోటరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ డిస్‌ప్లే
ఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
1080x2520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
48+5 ఎంపీ  డబుల్‌ రియర్‌  కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా 
4132 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top